News December 3, 2025
SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
Similar News
News March 26, 2026
ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

IPL-2026లో ముంబై స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్‌లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.
News March 26, 2026
యువతకు అలర్ట్.. TGPSC OTR గడువు పొడిగింపు

KNR జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిగా లేదా అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన SC వర్గీకరణ నేపథ్యంలో విద్యా అర్హతల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి APR 10 వరకు అవకాశం కల్పించారు.
News March 26, 2026
HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


