News December 3, 2025
నేడు హుస్నాబాద్‌లో సీఎం పర్యటన

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News March 15, 2026
కోటిలింగాల గోదావరిలో వ్యక్తి మృతదేహం

వెల్గటూర్ మండలం కోటిలింగాల టెంపుల్ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 30–35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. అతడు లేత ఆకుపచ్చ రంగు చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్, ఎరుపు రంగు బనియన్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు వెంటనే వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 15, 2026
బుట్టాయిగూడెం: పాపకు నాటు వైద్యమే చేపిస్తా.. వైద్యులు షాక్

బుట్టాయిగూడెం(M) ముంజులూరు పంచాయతీ చిలుకూరు కొండగట్టుకి చెందిన మహిళ ఇటీవల పాపకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లని తెలియడంతో వైద్యులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆస్పత్రి వైద్యానికి తండ్రి ఒప్పుకోలేదు. నాటు వైద్యం, పసర ముందు ఇప్పిస్తానని చెప్పడంతో వైద్యులు షాక్ అయ్యారు. ఎట్టకేలకు అతనికి నచ్చజెప్పి చికిత్స అందించడంతో పాప సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News March 15, 2026
ఖమ్మం: మొదటి రోజు 99.88 హాజరు శాతం నమోదు

ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాశ్ నగర్‌లోని మౌంట్ పోర్ట్ స్కూల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం 16,962 మంది విద్యార్థుల్లో 16,941 మంది హాజరై 99.88 శాతం హాజరు నమోదైంది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.


