News December 3, 2025
MBNR: సర్పంచ్ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. SHARE IT.
Similar News
News March 24, 2026
వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు

వరంగల్ నగరంలో సోమవారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 36మందిని, లైసెన్స్ లేని మరో ఐదుగురుని పట్టుకున్నట్లు సీఐ సుజాత తెలిపారు. నిందితులకు కోర్టు జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News March 24, 2026
జనగామ: వలకు చిక్కిన 25 కిలోల భారీ బంగారు తీగ

రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న బంగారు తీగ రకం చేప పడటంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపను ఆసక్తిగా వీక్షించారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో చేపలు కనిపించడం అరుదని, ఇది గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని స్థానికులు తెలిపారు.
News March 24, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


