News December 3, 2025

‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

image

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.

Similar News

News March 23, 2026

ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

image

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.

News March 23, 2026

నిజామాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి!

image

ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతి నెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
​ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 23, 2026

యుద్ధానికి కావాల్సినంత డబ్బుంది: బెస్సెంట్

image

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా వద్ద కావాల్సినంత డబ్బు ఉందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమర్థించారు. యుద్ధం కోసం అదనంగా కేటాయిస్తున్న నిధులు కేవలం ఎక్స్‌ట్రా మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడా డబ్బు ఇప్పటికే ఉందని తెలిపారు. ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.