News December 3, 2025

MBNR: సర్పంచ్ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు

image

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. SHARE IT.

Similar News

News March 17, 2026

నిజాంసాగర్: నవోదయ 6వ తరగతి ప్రవేశ ఫలితాలు విడుదల

image

నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయని ఎగ్జామ్ ఇన్‌ఛార్జ్ ప్రభాకర్ తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహించిన పరీక్ష ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx ద్వారా చూసుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ రూల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవాలన్నారు.

News March 17, 2026

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత!

image

RR జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత కార్యక్రమం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దంపతులు CARA పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి 3.5 ఏళ్ల తర్వాత పిల్లలను దత్తత తీసుకున్నారు. గత నెల రోజులుగా ఫాస్టర్ కేర్ కింద పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండగా అనుబంధం సరిగ్గా ఉండడంతో కలెక్టర్ వద్ద ఫైనల్ దత్తత పత్రాలు అందుకున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.

News March 17, 2026

TU: 603 మంది ఉద్యోగాలకు ఎంపిక

image

టీయూలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్‌లో 603 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేసినట్లు ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు తెలిపారు. ఆన్‌లైన్‌లో 1,470 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,255 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అందులో 603 మంది మొదటి దశలో ఎంపిక కాగా మరో 25 మంది 2వ దశకు ఎంపికైనట్లు చెప్పారు. 90% అమ్మాయిలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు.