News December 3, 2025
MDK: ఎవరికి వారే.. ఏకాభిప్రాయ సాధనకు బుజ్జగింపులు

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు ఎవరికి వారే బరిలో దిగడంతో ఏకాభిప్రాయం కోసం నేతలు తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో 492 జీపీలు, సంగారెడ్డిలో 613 జీపీలు, సిద్దిపేట జిల్లాలోని 508 జీపీలతో పాటు వార్డులకు 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News March 5, 2026
సిద్దిపేట: యువతి దూరమైందని సూసైడ్

ప్రేమించిన యువతి దూరమైందని UPకి చెందిన ప్రదీప్ కుమార్ (మేనేజర్) ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మం. వెలికట్ట శివారులోని కంపెనీలో పనిచేస్తూ దుద్దెడలో ఉంటున్న ప్రదీప్, గతంలో తనతో పనిచేసిన యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లినప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. త్రీటౌన్ CI లక్ష్మీబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
పెనుమూరు: బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. పెనుమూరు మండలం స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్‌పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్‌పై వస్తూ చార్వగాని పల్లె సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
టీ.నర్సాపురం: చెట్టుకు చుట్టుకుని కొండచిలువ.. భయపడ్డ ప్రజలు

మండలంలోని వీరభద్రారం వెళ్లే దారిలో నిన్న రాత్రి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రహదారి పక్కన చెట్టుకు చుట్టుకుని ఉండగా గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామస్థులు కలిసి దాడి చేసి పామును చంపినట్లు చెప్పారు. గ్రామంలోకి వచ్చిన ఈ కొండచిలువ రెండు కోళ్లను తినేసింది తెలిపారు.


