News December 3, 2025

MDK: ఎవరికి వారే.. ఏకాభిప్రాయ సాధనకు బుజ్జగింపులు

image

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు ఎవరికి వారే బరిలో దిగడంతో ఏకాభిప్రాయం కోసం నేతలు తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో 492 జీపీలు, సంగారెడ్డిలో 613 జీపీలు, సిద్దిపేట జిల్లాలోని 508 జీపీలతో పాటు వార్డులకు 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News March 14, 2026

టెన్త్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డా.శబరిష్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 14, 2026

ధైర్యంగా పరీక్షలు రాయండి.. విజయం మీదే: మంత్రి సీతక్క

image

14 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మీ జీవితాన్ని నిర్ణయించే చివరి పరీక్షలు కావని.. మీ కష్టానికి మొదటి పరీక్ష అన్నారు. తల్లిదండ్రులు, గురువులు మీ విజయాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్ష రాయాలని పిలుపునిచ్చారు.

News March 14, 2026

సంగారెడ్డి: 233 ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని 233 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం నిధులు విడుదల చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4.66 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పాఠశాల భవనాల్లోని అత్యవసర మరమ్మతుల కోసం మాత్రమే వినియోగించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.