News December 3, 2025

VKB: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎస్పీ

image

సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసులకు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్‌ను ఆవిష్కరించి 42 రోజుల శిక్షణను ప్రారంభించారు. సైబర్ నేరాలు నియంత్రణలో ఇస్తున్న శిక్షణను పోలీసులు అవగాహన కల్పించుకోవాలన్నారు.

Similar News

News March 7, 2026

నల్గొండలో ‘నామినేటెడ్’ పదవుల సందడి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పదవుల వేట మళ్లీ మొదలైంది. ఉగాది పర్వదినం నాటికి పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశలు చిగురించాయి. గతంలో కొందరికే అవకాశం దక్కగా, ఈసారి ఎలాగైనా పదవి సాధించాలని ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొంది.

News March 7, 2026

సివిల్స్‌లో ఫలితాల్లో సత్తాచాటిన విజయనగరం కుర్రోడు

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్ విష్ణు సత్తా చాటారు. UPSC ఫలితాల్లో ఆయన జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించి IRSకు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. తండ్రి శ్రీనివాసరావు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. తల్లి ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రెండు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందారు.

News March 7, 2026

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

image

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.