News December 3, 2025
కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించింది -సీపీఐ

కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించి ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం విశాఖలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 హామీలు అమలు చేయలేదన్నారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News April 7, 2026
విశాఖ: హైవేపై ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఆనందపురం మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో అంగుళూరు రాజు(36) మృతి చెందారు. గాజువాకలో ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు, వ్యాన్‌లో లోపం రావడంతో రోడ్డుపక్కన నిలిపి మరమ్మతు చేస్తుండగా ఓ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు మృతదేహాన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు. భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News April 7, 2026
రేపు విశాఖకు డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ రానున్నారు. విజయవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఆంధ్ర యూనివర్సిటీలో జరగనున్న శతాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 8:25కు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. అధికారుల వీటికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.
News April 7, 2026
రేపు విశాఖకు కేంద్ర కార్యదర్శి రాక

కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. సౌరభ్ గార్గ్ బుధవారం విశాఖకు రానున్నారు. జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి, ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యే నేషనల్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ సర్వే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత అధికారులతో సమావేశమై సూచనలు ఇస్తారు. ఆయనతో జేడీ రజత్, ఏడీ రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు.


