News December 3, 2025
ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.
Similar News
News April 3, 2026
రెండేళ్లుగా సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి

TG: గత రెండేళ్లుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. 2025-26లో 72 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తి 58MTకే పరిమితమైంది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఇది 16% తక్కువ. FY25లోనూ 72MT టార్గెట్ అయితే 69MTనే ఉత్పత్తి చేసింది. భారీ వర్షాలు, మార్కెట్‌లో లో గ్రేడ్ బొగ్గుకు డిమాండ్ తగ్గడం, సంస్థ బొగ్గు ధరలను పెంచడం, కొత్త గనుల మంజూరులో జాప్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది.
News April 3, 2026
నిర్మల్‌లో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఏప్రిల్ 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని దళిత సంఘాల ప్రతినిధులు, కవులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కోరారు.
News April 3, 2026
ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

★ 1914: భారత్ తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా జననం
★ 1955: సింగర్ హరిహరన్ జననం
★ 1962: సినీనటి జయప్రద జననం
★ 1973: నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
★ 1680: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణం
★ 1943: ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన


