News December 3, 2025
అనకాపల్లి: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

రసాయనక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 కు సంబంధించి రబీ,2026-27 కు సంబంధించి ఈనెల 3న ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. వర్క్ షాప్ కు రైతులు ,స్వయం సహాయక సంఘాలను పిలిచి ఐదు సూత్రాలను వివరించాలన్నారు.
Similar News
News March 18, 2026
NTR: చుక్కలు చూపిస్తున్న నిమ్మ ధర

వేసవి ఎండలు ముదురుతుండటంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగింది. NTR జిల్లా వ్యాప్తంగా నిమ్మకాయల దిగుమతులు తగ్గడంతో మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ ధర నాణ్యతను బట్టి రూ.5 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. ధర భారీగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో కాయలు దొరకని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. ఎండల వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసాన్ని ఆశ్రయించే సామాన్యుడికి ఈ ధరలు భారంగా మారాయి.
News March 18, 2026
TGNPDCL అధికారుల డిప్యూటేషన్‌కు ఆదేశాలు

హనుమకొండ: TGNPDCL నుంచి TGRPDCLకు 12 మంది అధికారులను డిప్యూటేషన్‌పై పంపిస్తూ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుతో కార్యకలాపాల ప్రారంభం, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్‌వర్క్ పునర్వ్యవస్థీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తక్షణమే హాజరుకావాలని, డిప్యూటేషన్ గడువు ఒక సంవత్సరం అని తెలిపారు.
News March 18, 2026
విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో 5 రోజుల వరకే గ్యాస్ నిల్వలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పశ్చిమ ఆసియా యుద్ధంతో కేంద్రం ఆంక్షలు విధించి గృహ, ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్లాంట్ ఉత్పత్తికి రోజుకు 12 టన్నుల గ్యాస్ అవసరముండగా కేవలం 5 రోజుల నిల్వలే మిగిలాయి. కటింగ్ పనులు, ఉత్పత్తి నిలిచే ప్రమాదం ఉంది. స్టీల్ బ్లూమ్స్‌ను బయట ప్రాసెసింగ్‌కు పంపడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. కేటాయింపులు పెంచాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


