News December 3, 2025
కాణిపాకం సేవలు ఇక ఆన్ లైన్ లోనూ…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్‌సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు. లేదా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.
Similar News
News March 20, 2026
ఎచ్చెర్ల: 18 ఏళ్లలో 7 నియామకాలు మాత్రమే..?

ఎచ్చెర్లలోని ఆంధ్రా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని 2008 జూన్ 25న డాక్టర్ B.Rఅంబేడ్కర్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేసి 18 ఏళ్లు కావొస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు రెగ్యులర్ ఫ్యాకల్టీని మాత్రమే నియమించారు. 2010 నోటిఫికేషన్‌లో బయో టెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్క్‌లో 3 నియామకాలు చేపట్టారు. ప్రభుత్వాలు మారినా, వైస్ ఛాన్సిలర్లు మారినా.. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగలేదనే టాక్ నడుస్తోంది.
News March 20, 2026
కృష్ణా: రైలు పట్టాలపై ముక్కలైన యువకుడి డెడ్ బాడీ!

తరిగొప్పుల రైల్వే పట్టాల మధ్య సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. రైలు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు పసుపు రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. గుడివాడ రైల్వే SI మహబూబ్ బాషా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గురించి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని ఆయన కోరారు.
News March 20, 2026
శ్రీకాకుళం: 10th ఇంగ్లీష్ పరీక్ష వాయిదా

శ్రీకాకుళం జిల్లాలో రేపు జరగాల్సిన 10th ఇంగ్లిష్ (థర్డ్ లాంగ్వేజ్) ఎగ్జామ్ వాయిదా పడింది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం మార్చి 21న సెలవు ప్రకటించడంతో, రేపు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 2న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.


