News December 3, 2025
కాణిపాకం సేవలు ఇక ఆన్ లైన్ లోనూ…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్‌సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు. లేదా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.
Similar News
News December 5, 2025
మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.
News December 5, 2025
ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.
News December 5, 2025
చిలకలూరిపేట ఘటనపై అధికారులను ఆరా తీసిన మంత్రి లోకేశ్

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ పేర్కొన్నారు.


