News December 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 3, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News March 22, 2026

BREAKING: అనంతపురంలో పెట్రోల్ ‌పోస్తుండగా మంటలు

image

గుమ్మఘట్ట (M) గోనబావిలో పెట్రోలు మండి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామంలో చిల్లర కొట్టు, హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు, భార్య, కూతురు దుకాణంలో ఉండగా ఆదివారం పెట్రోలును ఒక బాటిల్ నుంచి మరో బాటిల్‌లోకి మారుస్తున్నారు. వారి సమీపంలో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ ఉండటంతో పెట్రోలు మండి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

News March 22, 2026

ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

image

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.

News March 22, 2026

ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

image

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్‌లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.