News December 3, 2025
VKB: లైన్ మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ

కరెంట్ షాక్‌తో యువకుని మృతికి కారణమైన విద్యుత్ శాఖ లైన్‌మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేశారు. 2020లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరంపల్లిలో లైన్‌మెన్ అబ్దుల్ జలీల్, ఎల్‌సీ (Line Clear) తీసుకోకుండా నిర్లక్ష్యంగా కుషా రెడ్డిని కరెంట్ పోల్‌పైకి ఎక్కించి మృతికి కారణమవడంతో ఈ శిక్ష పడినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News March 21, 2026
అన్నమయ్య: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి..!

అన్నమయ్య జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు జేసీ శివ నారాయణ శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 08571-293001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News March 21, 2026
పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి: జనగామ కలెక్టర్

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాలోని 12 మండలాలకు నుంచి 39 ప్రత్యేక ఆర్టీసీ పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు హాజరు కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News March 21, 2026
పల్నాడు జిల్లాలో వర్షం

పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మెరుపులు, ఈదురు గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు కొనసాగించాలన్నారు. పెదకూరపాడు, రొంపిచర్ల, అమరావతి మండలాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది..?


