News December 3, 2025
స్మృతి మంధాన పెళ్లి కొత్త డేట్ ఇదేనా?

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో తొలుత స్మృతి తండ్రి, ఆపై పలాశ్ ఆస్పత్రుల్లో చేరి డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా పెళ్లికి కొత్త డేట్ ఫిక్స్ అయిందని, DEC 7న వివాహం జరగనుందని SMలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి బ్రదర్ శ్రవణ్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త డేట్ గురించి మేము ప్రకటించలేదు. ప్రచారంలో ఉన్న డేట్ రూమర్ మాత్రమే’ అని చెప్పారు.
Similar News
News March 22, 2026
కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.
News March 22, 2026
ఈ జిల్లాల్లో రేపు పిడుగులతో వర్షాలు!

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంది. ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచించింది.
News March 22, 2026
ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.


