News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
Similar News
News March 13, 2026
IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నారు.
News March 13, 2026
విజయ్ ఎన్డీఏలో చేరతారా?

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న TVK చీఫ్ విజయ్ రేపటి ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. NDAతో పొత్తుపై చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. విజయ్ NDAలో చేరేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి పార్టీ మీటింగ్‌లోనూ కొందరు TVK నేతలూ కమలదళంతో పొత్తుకే మొగ్గు చూపారట.
News March 13, 2026
PHOTO GALLERY: ‘మూసీ’ డిజైన్లు చూశారా?

TG: రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. తొలిదశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘మూసీ ఇన్వైట్స్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. తాజాగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు రిలీజ్ అయ్యాయి. పైన గ్యాలరీలో వాటిని చూడొచ్చు.


