News December 3, 2025
ఐబొమ్మ రవికి బంపరాఫర్?

ఐబొమ్మ రవి కేసులో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడని వార్త సారాంశం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని టాక్.
Similar News
News March 19, 2026
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలమే దిక్కు!

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకీ తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల యాసంగి పంటలకు ఏప్రిల్ 7 వరకు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీరు ఇవ్వాల్సి ఉంది. ఎడమ కాల్వ ద్వారా రోజుకు 21,500 క్యూసెక్కుల నీరు అవసరం.
పంటలకు సుమారు 80 టీఎంసీలు, తాగునీటికి 20 టీఎంసీలు అవసరమవుతుండగా, ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే ఉండగా, పంట పండాలంటే మరో 40 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి తీసుకోవాల్సి ఉంది.
News March 19, 2026
భీమవరం: ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ పెంకి విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు.
News March 19, 2026
EPF పెన్షన్ ₹1000 సరిపోదు: పార్లమెంటరీ ప్యానెల్

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద నెల వారీ పెన్షన్ కేవలం ₹1000 ఇస్తుండడాన్ని తక్షణమే సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. గౌరవప్రదమైన స్థాయిలో ప్రజల పెన్షన్లు ఉండాలని పేర్కొంది. కనీస పెన్షన్ ₹7,500 చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవనవ్యయం పెరిగినా అమౌంట్ మారలేదని.. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే విషయాన్ని పరిశీలించాలని కమిటీ పేర్కొంది.


