News December 3, 2025
గట్టమ్మ వద్ద రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎస్పీ

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ముందుగా జాకారం సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గట్టమ్మ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News December 3, 2025
స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it
News December 3, 2025
ఖమ్మం: తొలి రెండు రోజులు మద్యం కిక్కు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాల కిక్కు అదిరింది.. 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి కేటాయించిన మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు మొదలయ్యాయి. తొలి రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోని 204 వైన్ షాపులకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి సుమారు రూ.40 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఎక్సైజ్ సంవత్సరం ముగింపు చివరి నెల రోజులు వైన్ షాపుల్లో ఆశించిన మేర మద్యం విక్రయాలు జరగలేదు.
News December 3, 2025
ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.


