News December 3, 2025

సంగారెడ్డి: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లోని 234 సర్పంచ్, 1,960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు

Similar News

News March 28, 2026

ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న కర్నూలు ఎస్పీ

image

బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని శనివారం సాయంత్రం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో పాండురంగా రెడ్డి, ఛైర్మన్ బండి మౌలీశ్వర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించి, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, వేదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News March 28, 2026

SKU వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్ బాధ్యతలు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల 13న వైస్ ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 28, 2026

గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

image

గల్ఫ్ దేశాల గగనతలాలు ఉపయోగించుకొని ఇరాన్‌పై US-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ మండిపడ్డారు. బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, UAE తదితర దేశాలపై తాము దాడులు ఆపాలంటే ఆ 2 దేశాలకు అనుమతి ఇవ్వొద్దన్నారు. ఏ దేశంపైనా తాము ముందస్తు దాడులు చేయబోమని.. తమ అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. శత్రువులకు సహకరించిన వారినీ వదలబోమన్నారు.