News December 3, 2025
ఖమ్మం: అయ్యప్ప భక్తులకు శుభవార్త

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నెల (డిసెంబర్) 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్‌ను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.
Similar News
News March 8, 2026
అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
News March 8, 2026
అమలాపురం మహిళల ప్రతిభ

అమలాపురానికి చెందిన మహబూబ్ షాహీరా, షకీలా సోదరీమణులు పరుగు పందేల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. 76 ఏళ్ల షాహీరా తన 16వ ఏట మొదలుపెట్టిన పరుగును 60 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. గతేడాది పుణే మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆమె ప్రథమ స్థానం సాధించారు. షకీలా అథ్లెటిక్స్‌తో పాటు బాస్కెట్‌బాల్‌లోనూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సత్తా చాటారు. వీరిద్దరూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News March 8, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా చూచిరాత?

కడప జిల్లాలో 32 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో ఇన్విజిలేటర్లు చూచిరాత రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సంబంధిత అధికారులకు, ఇన్విజిలేటర్లకు, బందోబస్తు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని DEO తెలిపారు.


