News December 3, 2025
సిద్దిపేట: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అక్కన్నపేట, చేర్యాల, దుల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు.
Similar News
News March 21, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (58532) రైలు రీషెడ్యూల్ అయింది. మార్చి 21న సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనివార్య కారణాల వల్ల రాత్రి 6:50 గంటలకు బయలుదేరనుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
News March 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310
News March 21, 2026
అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.


