News December 3, 2025

WGL: రెబల్స్‌ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.

Similar News

News January 12, 2026

వచ్చే ఏడాది భారత పర్యటనకు ట్రంప్!

image

భారత్‌ తమకు చాలా కీలకమైన భాగస్వామి అని ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. నిజమైన మిత్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా.. చివరకు సామరస్యంగా పరిష్కరించుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి గొప్ప స్నేహితుడైన ట్రంప్ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందన్నారు. టారిఫ్‌లు, ట్రేడ్ డీల్ వంటి వివాదాల నేపథ్యంలో గోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 12, 2026

మేడారంలో కూటి కోసం.. కోటి తిప్పలు!

image

కొందరు కూటి కోసం కోటి తిప్పలు పడుతుంటారు. ఇందులో భాగంగా మేడారం జంపన్నవాగు సమీపంలో ఓ వ్యక్తి ఒంటినిండా రంగు పూసుకొని గాంధీ తాత వేషాధారణలో కూర్చొని పలువురిని ఆకట్టుకుంటున్నాడు. చేతిలో కర్ర, కళ్లజోడు పెట్టుకుని చలి, ఎండలో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పాట్లు పడుతున్నాడు. జాతరకు వచ్చిన భక్తులు అతన్ని ఆసక్తిగా చూసి ఫొటోలు దిగి, కొంత నగదును సైతం ఇచ్చి వెళ్తున్నారు.

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.