News December 3, 2025

బుద్ధారం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం!

image

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామం బుద్ధారం సర్పంచ్‌గా విడిదినేని శ్రీలత అశోక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కొమ్మురాజు అమృతమ్మ, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామంలోని 12 వార్డులకు గాను, 9 వార్డులకు కూడా ఏకగ్రీవం పూర్తయింది.

Similar News

News December 3, 2025

సూర్యాపేట: ‘పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు స్పందించడం హాస్యాస్పదం’

image

పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు మంత్రులు స్పందించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజుల తర్వాత స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరనీ, కొందరు వాటర్‌లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు.

News December 3, 2025

GNT: మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్‌లతో మహిళలపై దుష్ప్రచారం

image

మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్‌లతో కాల్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని బాధిత మహిళలు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నంబర్ పెట్టడంతో ప్రతిరోజూ తమకు రకరకాల నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరువుకి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.

News December 3, 2025

చారకొండలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే బుధవారం చలి తీవ్రత కొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలంలో 17.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 18.5°C, వెల్దండలో 18.6°C, కల్వకుర్తిలో 18.9°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.