News December 3, 2025
కరీంనగర్: ఒత్తిళ్లకు ‘నై’.. సమరానికి ‘సై’..!

కరీంనగర్(R) మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. MA, LLB చదివిన ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వస్తున్న ఒత్తిళ్లను సైతం ఆమె లెక్కచేయకుండా సమరానికి సై అంటున్నారు.
Similar News
News December 4, 2025
ములుగు: నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ!

తమను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్థులకు తెలియజేస్తానని పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.


