News December 3, 2025

సిద్దిపేట సీపీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్

image

సిద్దిపేట సీపీ విజయ్‌కుమార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. ఈ ఖాతా ద్వారా పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడంతో విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం సీపీ విజయ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ నకిలీ ఖాతాను బ్లాక్ చేయించారు. తనకు ఫేస్‌బుక్ ఖాతా లేదని, ఇలాంటి రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఆయన సూచించారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 4, 2025

జగిత్యాల జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. గత రెండు రోజులు జిల్లాను వణికించిన అత్యల్ప ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత రాత్రి చలి తక్కువగా ఉండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేరెళ్ల, ఐలాపూర్లో 14.6℃, రాఘవపేట 14.7, రాయికల్, సారంగాపూర్ 14.8, మన్నెగూడెం 14.9, కథలాపూర్, జగ్గాసాగర్, పొలాసలో 15°Cగా నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత అంతంతమాత్రంగానే ఉంది.

News December 4, 2025

ధాన్యం రక్షణకు 5,228 టార్పాలిన్‌లు సిద్ధం: జేసీ

image

కోనసీమ జిల్లాలో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు 204 కొనుగోలు కేంద్రాల సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 5,228 టార్పాలిన్ షీట్లను అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. రైతులు ఈ షీట్లను ఉచితంగా వినియోగించుకుని, తమ పంట ధాన్యాన్ని రక్షించుకోవాలని, అనంతరం వాటిని తిరిగి అందించాలని ఆమె కోరారు.