News December 3, 2025
రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాబార్డు, ప్రణాళిక నిధులతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆర్‌అండ్‌బి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్ నందు ఆయన అధ్యక్షతన రహదారులు భవనాల శాఖ పరిధిలో వివిధ రహదారుల మరమ్మతు పనులపై సమీక్షించారు. రహదారి అభివృద్ధి పనుల నిర్వహణపై చర్చించారు.
Similar News
News December 3, 2025
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

జె.పంగులూరు మండలం చందలూరులో బుధవారం రైతన్నా మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
News December 3, 2025
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
News December 3, 2025
వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మల్లికార్జున

చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన ఎన్.మల్లికార్జునను వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించినట్లు సంఘం వ్యవస్థాపకుడు పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘానికి, మద్దతు తెలిపిన వాల్మీకులకు మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి–బోయ వర్గాల అభివృద్ధి, ఎస్‌టీ సాధన కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.


