News December 3, 2025
కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్‌లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్‌లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.93.36 కోట్లు, అక్టోబర్‌లో రూ.93.44 కోట్లు, నవంబర్‌లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.
Similar News
News December 5, 2025
రేపు వాయిదా పడిన డిగ్రీ పరీక్ష నిర్వహణ

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష తుఫాను కారణంగా వాయిదా పడింది. ఆరోజు జరగాల్సిన పరీక్ష ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పరీక్షకు తప్పక హాజరు కావాలన్నారు.
News December 5, 2025
కడప జిల్లా రైతు సూసైడ్..!

సింహాద్రిపురం మండలం బలపనూరులో శుక్రవారం ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని రైతు నాగేశ్వర రెడ్డి (63) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తన రెండు ఎకరాల పొలంలో పంటలు పండక అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు అధికం కావడంతోపాటు తన భార్య అనారోగ్యంతో బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో మనస్థాపం చెందిన నాగేశ్వర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్‌లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.


