News April 18, 2024
ఫైనల్‌లో నేను చివరి వరకు ఉంటే బాగుండేది: రాహుల్

వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో తాను ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డారు. సమయం వెనక్కి వెళ్లగలిగితే మీరు ఏ నిర్ణయాన్ని సరిచేసుకుంటారని అశ్విన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ జవాబిచ్చారు. ‘ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై నేను చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. దీని వల్ల 30-40 రన్స్ ఎక్కువ వచ్చేవి. ప్రపంచకప్ మా చేతుల్లో ఉండేది. దానికి నేను చింతిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
ట్యాక్స్ పేయర్స్‌కు పెద్ద ఉపశమనం

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) రివైజ్ చేసుకోవాలనుకునే వారికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంచి వెసులుబాటు కల్పించారు. తక్కువ ఫీజుతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. అయితే, ITR-1, 2 ఫైల్ చేయడానికి మాత్రం యథావిధిగా జులై 31 చివరి తేదీగా ఉంటుంది. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 2%గా నిర్ణయించారు. త్వరలోనే సరళీకరించిన కొత్త టాక్స్ రూల్స్ కూడా రాబోతున్నాయి.
News February 1, 2026
దేశ పురోగతికి ఆరు సూత్రాలు

ప్రపంచ పరిణామాలను అందిపుచ్చుకొంటూ దేశం మరింత ముందుకు సాగేలా కేంద్రం బడ్జెట్లో ఆరు సూత్రాలను ప్రకటించింది.
1. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ పెంచడం
2. పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ
3. MSMEలను ఛాంపియన్లుగా మార్చడం
4 మౌలిక సదుపాయాలకు మరింత ప్రోత్సాహం
5 దీర్ఘకాలిక స్థిర భద్రతను కల్పించడం
6 సిటీ ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి.
News February 1, 2026
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


