News December 3, 2025

శ్రీశైల మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను టీమిండియా క్రికెటర్లు జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనార్థమై బుధవారం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేసి, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో వారిని సత్కరించారు. వారివెంట దేవస్థానం ఏపీఆర్ఓ డాక్టర్ శివారెడ్డి ఉన్నారు.

Similar News

News December 6, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

image

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లై‌ట్‌ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

News December 5, 2025

సిద్దిపేట: ప్రభుత్వాన్ని బీసీ సమాజం క్షమించదు: హరీష్ రావు

image

బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర చారి బలైపోవడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. రేవంత్ అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని ‘X’లో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.

News December 5, 2025

సిద్దిపేట: కలెక్టర్‌ను కలిసిన స్వయం సహాయక సభ్యులు

image

స్వయం సహాయక సంఘా సభ్యులు Event Management పై National Institute of Tourism and Hospitality Management(NITHM) హైదరాబాద్‌లో 5 రోజులు పాటు శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆరుగురు స్వయం సహాయక సభ్యులు బాలలక్ష్మి, మంజుల, శ్వేతాకళ, భూలక్ష్మి, శిరీష, లావణ్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి పలు రకాల యూనిట్లకు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు.