News December 3, 2025

కాకినాడ: GOOD NEWS.. ‘ఈనెల 11 నుంచి శిక్షణ’

image

వాకిలపూడిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈనెల 11వ తేదీ నుంచి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. SSC లేదా ఆపై తరగతుల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. మూడు నెలల శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, యూనిఫాం కూడా అందిస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

భద్రాద్రి: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓ, ఏఓ, ఏఈఓ, పోలీస్ శాఖ, ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ CEO నాగలక్ష్మి ఉన్నారు.

News December 5, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 5, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 5, 2025

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

image

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్‌గా కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండ సర్పంచ్‌గా భుఖ్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.