News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్‌లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.
Similar News
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.
News December 4, 2025
1,213 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో 1,213 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా, ITI, టెన్త్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 26ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు NATS పోర్టల్‌లో, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు NAPS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. ఎంపికైన అప్రెంటిస్‌లకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. <


