News December 3, 2025
కోనసీమ జిల్లా వాసులకు GOOD NEWS

అమలాపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతి లక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని ఆమె సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News December 4, 2025
భారతీయుడికి జాక్‌పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్‌కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్‌వైజర్‌గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News December 4, 2025
తిరుపతి: డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీ జరిమానా

తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మంది డ్రైవర్లకు 3వ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి బుధవారం రూ.3,10,000 జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP రామకృష్ణ చారి తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 25 మందికి రూ.500 చొప్పున రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <


