News April 18, 2024

మెదక్: ఎండలతో అల్లాడుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత ఎక్కవగా ఉండగా.. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎండలు కాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పడాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News November 14, 2025

మెదక్: ‘టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి’

image

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించాలని
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును జిల్లా PRTU TS అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు.

News November 14, 2025

పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

image

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 14, 2025

విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

image

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.