News December 4, 2025

స్క్రబ్ టైఫస్‌ వ్యాధిపై ఆందోళన వొద్దు: DMHO

image

రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈవ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందని DMHO డా. కె.వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధి సుత్సుగాముషి అనే కీటకం కుట్టడం ద్వారానే సోకుతుందని ఆయన వెల్లడించారు. జ్వరం లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.

Similar News

News February 5, 2026

రాజానగరంలో పులి పంజా.. ఆవుపై దాడి!

image

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఆవుపై పెద్దపులి దాడి చేసిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిరంతరం గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.

News February 5, 2026

రాజానగరంలో మెగా జాబ్ మేళా.. గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఫిబ్రవరి 8న రాజానగరంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెక్నికల్, నాన్-టెక్నికల్ అభ్యర్థులు ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.