News April 18, 2024

శరీరంలో కొవ్వు ఎక్కువైతే వచ్చే సమస్యలివే!

image

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే లోపలి కండరాల్లో తిమ్మిరి వస్తుందని, శరీర భాగాలు బలహీనంగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుందంటున్నారు. మెదడుకు సరఫరా అయ్యే రక్తంపై ప్రభావం పడి తలనొప్పి, మతిమరుపు వస్తుందని.. గ్యాస్, అజీర్ణం, చర్మంపై దురద, మంట, మగవారిలో లైంగికాసక్తి, వీర్యకణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

Similar News

News November 7, 2025

ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

image

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.

News November 7, 2025

టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

image

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.

News November 7, 2025

ఈ వ్యాధులు ఉంటే అమెరికా వీసా కష్టమే!

image

వీసా నిబంధనలను కఠినం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుండె సంబంధ సమస్యలు, రెస్పిరేటరీ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిని అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.