News December 4, 2025
కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News December 5, 2025
భద్రాద్రి: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓ, ఏఓ, ఏఈఓ, పోలీస్ శాఖ, ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ CEO నాగలక్ష్మి ఉన్నారు.
News December 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 5, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 5, 2025
జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్‌గా కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండ సర్పంచ్‌గా భుఖ్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.


