News December 4, 2025
భూసేకరణకు పీసా కమిటీ ఆమోదం తీసుకోవాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేసే భూసేకరణకు సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్టు, ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News December 5, 2025
విద్యార్థిని ఆత్మహత్య కేసులో జువైనల్ హోంకు నిందితుడు: డీఎస్పీ

అసభ్య ప్రవర్తన, వికృత చేష్టలతో విద్యార్థిని <<18465473>>స్పందన<<>> (17) మృతికి కారణమైన బాలుడిని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. గత నెల 26న దాడికి గురైన విద్యార్థిని స్పందన మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడిపై పోక్సో, ఐపీసీ 305 సెక్షన్లు నమోదు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ తెలిపారు. కేసు నమోదులో నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు.
News December 5, 2025
మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.
News December 5, 2025
ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.


