News December 4, 2025

కర్నూలు: ‘ఆ మండలం మాకొద్దు’

image

ఆదోని మండల విభజనపై ఆందోళనలు <<18458309>>ఉద్ధృతం<<>> అవుతున్నాయి. 17 గ్రామాలతో పెద్ద హరివణం మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. మదిరె, నాగనాథహళ్లి, గణేకల్ తదితర గ్రామాల ప్రజలు పెద్దహరివరణం తమకు 30 కి.మీ దూరం వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని రూరల్, అర్బన్, పెద్ద హరివణం, పెద్ద తుంబళం మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News December 4, 2025

గద్వాల్: ఓ యువత ఏటువైపు మీ ఓటు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలో 11,600 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో మొదటి ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా లేక మాటలు చెప్పి మబ్బి పెట్టే వారికి ఓటు వేస్తారా అనే సందేహం ఉంది. యువత మాత్రం అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేస్తారని పలువురు ప్రజలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?

News December 4, 2025

నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.

News December 4, 2025

Dy.Cm భట్టి స్వగ్రామం సర్పంచి స్థానం ఏకగ్రీవం

image

Dy.Cm భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా(మం) స్నానాలలక్ష్మీపురం గ్రామపంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావుకు పోటీగా వేసిన ఇతర అభ్యర్థులందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పంచాయతీ సర్పంచ్‌తో పాటు 8 వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత దృష్ట్యా భట్టి, ఎమ్మెల్యే రాందాస్ సూచనలతో పోటీదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.