News December 4, 2025
VJA: పాత పైపు లైన్‌లకు చెక్.. త్వరలో 300 కి.మీ DPR తయారీ.!

విజయవాడ నగరంలో పాత పైపులైన్ల లీకులు, డ్రైనేజీల పక్కన ఉండటం వల్ల నీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, అధికారులు యుద్ధప్రాతిపదికన అత్యవసర ప్రాంతాల్లో పాత పైపులు తొలగించి కొత్తవి వేస్తున్నారు. నగరంలో సుమారు 300 కి.మీ పైపులైన్లు మార్చాల్సి ఉంది. దీనికి ₹80-90 కోట్లు ఖర్చవుతుందని, త్వరలో DPR ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు.
Similar News
News December 4, 2025
పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్‌ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.
News December 4, 2025
NLG: రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు

సర్పంచ్, వార్డు సభ్యుడికి బ్యాలెట్ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యుడికి తెలుపు రంగు ఉన్న బ్యాలెట్ పేపర్‌ను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. నల్గొండ, చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామపంచాయతీలో 991 సర్పంచ్ అభ్యర్థులు, 2,870 వార్డుల్లో 7,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్‌కు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 4, 2025
తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.


