News April 19, 2024
నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 30, 2026
NZB: స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఇవే..!

రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం అనేక ఉచిత గుర్తులను కేటాయించింది. వాటిలో ఏసీ, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్రెడ్, గ్యాస్ సిలిండర్, కుక్కర్, రిఫ్రిజిరేటర్, జామకాయ, ద్రాక్ష, పుచ్చకాయ, కెమెరా, టెలిఫోన్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్యాట్, ఫుట్బాల్, క్యారమ్ బోర్డు, విజిల్, కుర్చీ, టేబుల్, సోఫా, మంచం లాంటి 75 గుర్తులను కేటాయించారు.
News January 30, 2026
NZB: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

NZB జిల్లాలో రెండు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతల హామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.
News January 30, 2026
NZB: నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం ముగియనుంది. దీంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. కాగా నిన్న, మొన్న 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 400 నామినేషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఇందులో NZBలో 242, ఆర్మూర్‌లో 66, బోధన్లో 72, భీంగల్‌లో 37 నామినేషన్లు వచ్చాయి.


