News December 4, 2025

నాగిరెడ్డిపేట: MPDO, MPO సస్పెండ్

image

నాగిరెడ్డిపేట MPDO లలిత కుమారి, MPO ప్రభాకర్ చారీలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయానుగుణంగా అధికారులకు వివరాలను అందించడంలో అలసత్వంగా వ్యవహరించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా వెళ్లడంతో వేటు వేసింది. పంచాయతీ ఎన్నికలను అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.

News December 6, 2025

నెల్లూరు: 500 మీటర్లలో.. లెక్కలేనన్ని గోతులు

image

బుచ్చి మున్సిపాలిటీ నడిబొడ్డులో మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపై వెళ్లాలంటే కుదుపులకు వాహనాలతోపాటు,ఒళ్లు గుల్లవుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నా ప్రధాన రహదారుల రూపు మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

News December 6, 2025

ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

image

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.