News December 4, 2025

కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే స్టేజ్ -1, 2 అధికారుల శిక్షణ పూర్తయిందని, రేపటి నుంచి మిగతవారికి శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు.

News December 4, 2025

ఈ 3 బ్యాంకులు సేఫ్: RBI

image

భారత ఆర్థిక వ్యవస్థకు SBI, HDFC, ICICI బ్యాంకులు మూల స్తంభాలని RBI తెలిపింది. వీటిలో డబ్బు సేఫ్‌గా ఉంటుందని వెల్లడించింది. RBI రూల్స్ ప్రకారం, కామన్ ఈక్విటీ టైర్1 కింద ఎక్కువ నగదు, క్యాపిటల్ ఫండ్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ బ్యాంక్ కార్యకలాపాలు, అకౌంట్ హోల్డర్ల డబ్బుపై ప్రభావం చూపదు. అందుకే, ఇవి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు(D-SIB)గా గుర్తింపు పొందాయి.

News December 4, 2025

సూపర్ మూన్.. అద్భుతమైన ఫొటో

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. భూమికి దగ్గరగా, మరింత పెద్దగా, కాంతివంతంగా చందమామ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్‌ను తమ కెమెరాలలో బంధించి పోస్టులు చేస్తున్నారు. కాగా 2042 వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించడని నిపుణులు చెబుతున్నారు.