News December 4, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News December 8, 2025

పల్నాడు: ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు

image

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట పట్టణాల్లోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా పురుగుమందులు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా అవుతున్న భారీ మొత్తంలో పురుగుమందులను స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు.

News December 8, 2025

ఉమ్మడి వరంగల్‌లో 3వ దశలో 15,827 నామినేషన్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశలో పోటీ చేసేందుకు సర్పంచ్ 3515, వార్డులకు 12312 నామినేషన్లు దాఖలయ్యాయి.
★వరంగల్‌లో 109 జీపీలకు 624, 946 వార్డులకు 2502
★ములుగులో 46 జీపీలకు 209, 408 వార్డులకు 926
★భూపాలపల్లిలో 81 జీపీలకు 470, 696 వార్డులకు 1649
★మహబూబాబాద్‌లో 169జీపీలకు 1185, 1412 వార్డులకు 3592
★హనుమకొండలో 68 జీపీలకు 514, 634 వార్డులకు1780,
★జనగామలో 91జీపీలకు 513, 800 వార్డులకు 1863 నామినేషన్లు

News December 8, 2025

సరికొత్త రికార్డు సృష్టించిన విశాఖ పోర్టు

image

సరకులు రవాణాలో విశాఖ పోర్టు చరిత్ర సృష్టించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం 249 రోజుల్లోనే 60 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించింది. గత ఏడాదితో 273 రోజులతో పోలిస్తే 24 రోజులు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరడం విశేషం. ఈ ఘనతపై పోర్టు ఛైర్మన్ డాక్టర్ అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. సిబ్బందిని భాగస్వాములను అభినందించారు.