News April 19, 2024
మరోసారి గెలిస్తే రెండేళ్లలో నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ‘అధికారంలోకి వచ్చిన ఏడాది లేదా రెండేళ్లలోనే నక్సలిజాన్ని అంతం చేస్తాం. ఛత్తీస్గఢ్లో BJP సర్కార్ రాగానే 90 రోజుల్లోనే 86 మంది నక్సల్స్ హతమయ్యారు. 126 మంది అరెస్ట్ కాగా 250 మంది సరెండర్ అయ్యారు’ అని తెలిపారు. కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది మావోలు హతమైన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News September 16, 2025
నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.
News September 16, 2025
ఆ ఆరోపణలు నిరూపించాలి: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్

TG: గ్రూప్-1 ఉద్యోగాలను రూ.3Cr చొప్పున కొన్నారన్న <<17701513>>ఆరోపణలను<<>> ర్యాంకర్ల తల్లిదండ్రులు కొట్టిపారేశారు. ‘గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. మాలో కొందరికి సరిగ్గా తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. కష్టపడి, పస్తులుండి పిల్లలను చదివించాం. పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. మాకు న్యాయం చేయాలి లేదా ఆరోపణలు నిరూపించాలి’ అంటూ మీడియా ముందు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
News September 16, 2025
దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఉత్సవాలు: సత్యకుమార్

AP: దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో VJAలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘22వ తేదీ నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. VJAను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.