News December 5, 2025

తిరుమల: సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ 8న

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్పటి TTD ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ సిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం దీనిపై వాదనలు జరిగాయి. సిట్ 5 రోజుల కస్టడీ కోరగా నెల్లూరు ACB కోర్టు 8వ తేదీ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

Similar News

News December 6, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నల్గొండ: 1500 మంది పోలీసులతో భద్రత
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్
చండూర్: పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా హవా
కనగల్: సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి
చండూర్: రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన డిటి
నల్గొండ: మరో ఐదు రోజులే సమయం
నకిరేకల్: జోరందుకున్న దావత్ లు
తిప్పర్తి: ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: మంత్రి

News December 6, 2025

గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

image

TG: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్‌‌ను అధికారులు వివరించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News December 6, 2025

భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

image

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్‌ VVERలను భారత్ నిర్వహిస్తోంది.