News December 5, 2025
వనపర్తి జిల్లా TODAY.. టాప్ NEWS

>WNP సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ
>WNP: పెద్దగూడెంలో బీజేపీలో భారీ చేరికలు
>WNP: CM దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: BJP
>PNGL: ఈ ప్రయాణం ప్రమాదకరం
>WNP: బడి బయటి పిల్లలను పాఠశాలలకు పంపించాలి
>GPT: కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి: BRS
>ATKR: ఎన్నికల విధులు బాధ్యత ఈ విధంగా నిర్వహించాలి: ఎంపీడీఓ
>WNP: అభ్యర్థులకు వ్యాయ నిబంధనలపై అవగాహన కల్పించాలి
Similar News
News December 5, 2025
iBOMMA రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ

iBOMMA రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని, ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని సైబర్ క్రైం DCP అరవింద్ బాబు తెలిపారు. 8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని వెల్లడించారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. iBOMMAకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్లను మూసేసినట్లు డీసీపీ చెప్పారు.
News December 5, 2025
సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.
News December 5, 2025
శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.


