News December 5, 2025
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్యఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.
Similar News
News December 5, 2025
MHBD: సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా కోతుల బెడద

సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో గ్రామపంచాయతీలు నడిచాయి. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో MHBD జిల్లాలో ఫస్ట్, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 3వ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు కోతులు, కుక్కల బెడద సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా మారింది. పరిష్కరిచిన వారికీ ఓట్లు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు.
News December 5, 2025
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్‌ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News December 5, 2025
ఇండిగో.. ఒక్కరోజే 550 విమానాల రద్దు

నిన్న 550 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో DGCAకు నివేదిక ఇచ్చింది. ఫేజ్-2 ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) ప్రకారం సిబ్బంది లేక సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పింది. నిబంధనల అమలులో పొరపాట్లు, ప్లానింగ్ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 ఫ్లైట్లను నడుపుతోంది.


