News December 5, 2025

అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్‌లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

Similar News

News December 5, 2025

చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

image

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్‌గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.

News December 5, 2025

కర్నూలు: ‘QR కోడ్ స్కాన్ చేయండి.. అభిప్రాయం తెలపండి’

image

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని సివిక్స్ సొసైటీ కన్వీనర్ రఘురాం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సివిక్స్ సొసైటీ తరఫున క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆన్‌లైన్ సంతకం చేయాలన్నారు. దీన్ని 5 నియోజకవర్గాల ప్రజల తమ బాధ్యతగా భావించాలని కోరారు.

News December 5, 2025

ఏలూరు మెడికల్ కాలేజీలో సద్దుమణిగిన వివాదం

image

ఏలూరు మెడికల్ కాలేజీలో జూనియర్లు, సీనియర్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. సీనియర్లు తమపై దాడి చేశారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ గురువారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం జూనియర్లు సీనియర్‌లపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వివాదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ వారికి సూచించారు.