News December 5, 2025

భారీగా సంబరాలు.. బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ

image

అనంతపురంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ‘అఖండ-2’ విడుదలవుతుందని సంబరాలు భారీగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు 110 కేజీల కేక్‌ కట్ చేశారు. ‘జై బాలయ్య’ నినాదాలతో నగరం దద్దరిల్లింది. అయితే అనూహ్యంగా సినిమా వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ మూవీని డిసెంబర్‌లోనే రిలీజ్ చేస్తారా? సంక్రాంతికి ప్లాన్ చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 6, 2025

NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచినా 24 గంటలో అత్యల్పంగా వెల్దండ మండలం బొల్లంపల్లిలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి 14, ఎల్లికల్, ఊర్కొండ 14.4, బిజినపల్లి 14.7, తెలకపల్లి, యంగంపల్లి 14.9, సిరసనగండ్ల 15.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

News December 6, 2025

జనగామ: ఎన్నికల సందడి జోరుగా మద్యం తరలింపు

image

జిల్లాలో ఎన్నిక సందడి మొదలైంది. దీంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తూ.. ఎన్నికకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ తరుణంలో పట్టణాల నుంచి పల్లెలకు మద్యాన్ని భారీ స్థాయిలో తరలిస్తున్నారు. కాగా జిల్లాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాగా బెల్ట్ షాపులకు అధికారులు మందు అమ్మొద్దని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.